నేడు ఢిల్లీకి కేటీఆర్ బృందం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధానంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో కేటీఆర్ న్యాయనిపుణులతో చర్చించి పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలపై చర్చించనున్నారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై…
సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ అనుసరిస్తున్న వైఖరిపై సీరియస్ అయిన నేపథ్యంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని అంచనా వేసుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి న్యాయనిపుణులకు మరిన్ని ఆధారాలను అందించి వారితో చర్చించనున్నారు. కేటీఆర్ వెంట ఢిల్లీకి వినోద్ కుమార్ తో పాటు శ్రావణ్ కుమార్ కూడా వెళుతున్నారు.