నేడు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు…
హైదరాబాద్:నేడు హనుమాన్ శోభయాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్ బండ్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. శోభయాత్రకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. గౌలిగూడ రామ్ మందిరం నుంచి తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం వరకు నిర్వహించనున్న యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు చేపట్టారు. యాత్ర మార్గం వెంట సుమారు 100 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. గౌలిగైడ, కోఠి, కాచిగూడ, నారాయణగూడ, ఆర్టీసి క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, కవాడీగూడ, సికింద్రాబాద్ డైమండ్ పాయిట్, మహంకాళి ఆలయం, ఇంపీరియల్ గార్డెన్స్ మీదుగా తాడ్ బండ్ కు యాత్ర చేరుకుంటుంది.యాత్ర మార్గంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.