నేడు పంచాయితీ ఓటర్ల జాబితా విడుదల

కసరత్తు పూర్తి చేసిన అధికారులు
నల్లగొండ,డిసెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణలో ఏర్పడ్డ నూతన ప్రభు త్వం ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తుంది. అందులో భాగంగా బీసీ ఓటర్ల గణనను పూర్తి చేసిన అధికారులు శనివారం తుది జాబితాను విడుదల చేయనున్నారు.  గ్రామసభల్లో చర్చించి పరిష్కరించి ఈనెల 15న తుది జాబితాను ప్రకటిస్తామని జిల్లా పంచాయతీ అధికారి ఆడ్డాల శ్రీకాంత్‌ తెలిపారు. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌ ఎన్నికల రిజర్వేషన్లు 50శాతం మించడానికి వీలు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు. గత జూలైతో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరిపేందుకు నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. అవి కోర్టు ఉత్తర్వులతో నిలిచిపోవడంతోపాటు తాజా ఉత్తర్వులు రావడంతో ఆ దిశగా ఎన్నికల సంఘం పనులను వేగవంతం చేసింది. అందు లోభాగంగా గురువారం
ఎన్నికల సంఘం జాయింట్‌ సెక్రటరీ ఎన్‌.జయసింహారెడ్డి జిల్లాను సందర్శించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో నల్లగొండకు వచ్చిన బ్యాలెట్‌ పత్రాలను మహిళా ప్రాంగణంలో భద్ర పరిచారు. దీంతో ఆయన బ్యాలెట్‌ పేపర్లు, ఇతర పోలింగ్‌ సామగ్రిని, ఇండెలిబుల్‌ ఇంక్‌, ఎన్నికలకు సంబంధించిన ఫారాలు, కవర్లను భద్రపరిచిన గదులను పర్యవేక్షించి డీఆర్‌డీఓ కార్యాలయంలో భద్రపరిచిన బ్యాలెట్‌ బాక్సులను పరిశీలించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే పం చాయతీ ఎన్నికల నిర్వహణకు సకలం సిద్ధం చేశారు. హైకోర్టు మూడు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలో నిర్వహించిన కార్యక్రమాలను, చేసిన పనులను సవిూక్షించి భవిష్యత్‌లో ఎన్నికలకు సంబంధించి చేయాల్సిన కార్యక్రమాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

తాజావార్తలు