నేడు పోలీసు కస్టడీకి అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టుయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ ఉదయం అక్బరుద్దీన్‌ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు జిల్లా జైలుకు వైద్యుల బృందం చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం ఏఆర్‌ కార్యాలయానికి తరలించి అక్బరుద్దీన్‌ను విచారించనున్నారు.