నేడు ప్రధానితో ఆఫ్ఘాన్‌ అధ్యక్షుడు భేటీ

ఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయి. ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. ఆఫ్ఘాన్‌ భద్రతా దళాల శిక్షణలో భారత్‌ పాత్రను మరింత పెంచే విషయంపై కర్జాయి ప్రధానితో చర్చించనున్నారు. చర్చల్లో భాగంగా వివిధ రంగాలతో కూడిన నాలుగు ఒప్పంద పత్రాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. గనులు, ఎరువులు, యువజన వ్యవహారాలు, చిన్న తరహా ప్రాజెక్టులపై ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఏర్పాటుచేసిన విందులో కర్జాయి పాల్గోంటారు.