నేడు ప్రమాణం చేయనున్న ఖేడ్‌ మార్కెట్‌ పాలకవర్గం

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): నారాయణఖేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం శుక్రవరాం కొలువుతీరనుంది. ఈ మేరకు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జూకల్‌ శివారులోని మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి నర్సింలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు సువర్ణ శెట్కార్‌, ఉపాధ్యక్షుడు బాసిత్‌తోపాటు పాలకవర్గం సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్‌, ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. నూతన పాలకవర్గంలో సభ్యుడిగా నియమితులైన సత్యనారాయణగౌడ్‌ గురువారం ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డిని స్థానిక క్యాంపు కార్యాలయంలో శాలువా, పూలమాలతో సత్కరించారు. తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రైతుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.