నేడు ప్రాణహిత నుంచిరైతు పోరుబాట
కాగజ్గనర్: రైతు సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి రైతు పోరుబాటను ప్రారంభించనున్నట్లు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బద్రిసత్యనారాయణ తెలిపారు. దీన్ని కౌటాల మండలంలోని తుమ్డిహేటి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి, తక్కువ ధరకు ఎరువులు , విత్తనాలు ప్రభుత్వం సరఫరా చేయాలనే డిమాండ్లతో ఈనెల 22 వరకు జిల్లాలో ఈ పోరుబాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.