నేడు బెల్లి లలిత వర్ధంతి

యాదాద్రి,మే25(జ‌నంసాక్షి):తెలంగాణ గాణకోకిల బెల్లి లలిత 19 వ వర్థంతిని పురస్కరించుకుని చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. శనివారం రోజున మద్యాహ్నం 12 గంటలకు తెలంగాణ గాణ కోకిల బెల్లి

లలిత వర్ధంతి సభ జరుగుతుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం, దొడ్డికొమురయ్యహాల్లో దీనిని ఏర్పాటు చేశారు. సామాజిక తెలంగాణవాదులు , బహుజనులు, కళకారులు, బందువులు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, మేధావులు ,కవులు, రచయితలు,కార్మిక, కర్షక, అన్నివర్గాల ప్రజలు అదిక సంఖ్యలో హాజరై ఘనంగా నివాళ్లు అర్పించాలన్నారు. ఈ మేరకు గొల్లకురుమ డోలుదెబ్బ రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది.