నేడు భూమికి చేరువగా రానున్న గ్రహశకలం

న్యూఢిల్లీ : పుట్‌బాల్‌ పరిమాణమంత ఒక గ్రహశకలం శుక్రవారం భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్తుతుంది. శుక్రవారం అర్థరాత్రి 12.10 గంటల ( తెల్లవారితే శనివారం)కు ఇది భూమికి 27,700 కిలో  మీటర్ల సమీపంలోకి రానుందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఎన్‌. శ్రీరఘునందన్‌ కుమార్‌ చెప్పారు. 45 మీటర్ల వెడల్పు కలిగిన ఈ అంతరిక్ష శిల సెకనుకు  7.8 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వివరించారు. 2012 డీఏ 14 అనే ఈ గ్రహశకలాన్ని గత ఏడాది ఫిబ్రవరి 23న గుర్తించారు. దీనివల్ల భూమికి ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. మరోపక్క 1999 వై కే5 అనే మరో గ్రహశకలం శుక్రవారం సాయంత్రం 3.48 గంటలకు భూమికి 1,88,87,632 కిలోమీటర్ల దూరంలోకి రానుంది.