నేడు ‘మలాలా’ డే
ఐరాస, నవంబర్ 10 (జనంసాక్షి):
పాకిస్తాన్ సాహస బాలిక మలాలా యూసుఫ్‌జైకి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ మద్దతు ప్రకటిం చారు. చదువు కోసం పోరాడిన మలాలా ప్రపంచంలోని బాలికలందరి విద్యా హక్కుకు ప్రతినిధిగా మారిందని ప్రశంసించారు. ఆమె గౌరవార్థం నవంబర్ 10ని మలాలా డేగా ప్రకటించారు.మరోవైపు మలాలాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించాలంటూ విన తులు వెల్లువెత్తుతు న్నాయి. తాలిబన్ల కాల్పు లకు గురైన మలాల ప్రస్తుతం లండన్ ఆసు పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె క్రమం గా కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.