నేడు రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం
హైదరాబాద్: రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం జూబ్లీహాల్లో ఈ ఉదయం జరగనుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది నవంబర్ 4 నుంచి 7వరకు నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ వ్యవసాయ సదస్సు నిర్వహణ,ఎజెండా రూపకల్పనపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించనున్నారు. ప్రపంచ వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ జేమ్స్ బి బోల్గార్, డబ్య్లూఏఎఫ్ ఛైర్మన్ కెన్నత్ బేకర్ సహా పది రాష్ట్రల వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.



