నేడు వనపర్తికి హైకోర్టు జడ్జిల రాక
వనపర్తి అక్టోబర్ 21(జనం సాక్షి)వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు భవనం ప్రారంభం అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవాల కార్యక్రమానికి శనివారం హైకోర్టు న్యాయమూర్తులు డి.నాగార్జున,సాంబశివరావు నాయుడు విచ్చేయున్నారని జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దేవరాజుల భరత్ కుమార్ తెలిపారు.శుక్రవారం వనపర్తి న్యాయ న్యాయస్థాన భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.జిల్లా కేంద్రంలో రూపుదిద్దుకున్న వనపర్తిలో అవసరమైన కోటులన్నింటినీ ఏర్పాటు చేసే ప్రయత్నం జరుగుతుందని వివరించారు.ఇప్పటికే నాగర్ కర్నూల్ పరిధిలో కొనసాగిన గోపాల్పేట,రేవల్లి మండలాలు కొల్లాపూర్ కోర్టు పరిధిలో కొనసాగిన పానుగల్,వీపనగండ్ల,చిన్నంబావి మండలాలు వనపర్తి కోర్టు పరిధిలోకి వచ్చాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కోర్టులు రానున్నాయని జిల్లా ప్రజలకు ఈ కోర్టులు దోహదపడతాయని వివరించారు.ఈ సమావేశానికి న్యాయవాదుల సంఘం అధ్యక్షులు డి.భరత్ కుమార్ కార్యదర్శి కే.విజయభాస్కర్,ఉపాధ్యక్షులు జి.దినేష్ రెడ్డి సంయుక్త కార్యదర్శి జి.ఉత్తరయ్య మహిళా ప్రతినిధి జయలక్ష్మి సభ్యుడు రియాజ్ అహ్మద్ సీనియర్ న్యాయవాదులు బి చంద్రశేఖర రావు, బి.గోపాల్ రెడ్డి,బి.వెంకటేశ్వర్ రెడ్డి,డి.కిరణ్ కుమార్,బి.తిరుపతయ్య గౌడ్,షాకీర్ హుస్సేన్, డేగల కృష్ణయ్య,శ్రీనివాసులు గౌడ్ తదితరులు ఉన్నారు.
Attachments area