నేడు సుప్రీంలో వీరప్పన్‌ అనుచరుల పిటిషన్‌

న్యూఢిల్లీ : గంధం చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ అనుచరులైన నలుగురి ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని నేడు వారి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమాన్‌ కబీర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్‌రానుంది. జ్ఞానప్రకాశ్‌, సైమన్‌, మీ సేకర్‌ మాదయ్య, బిలవెంద్రన్‌లు కర్ణాటకలోని పలార్‌ వద్ద ల్యాండ్‌మైన్‌ పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న ఘటనలో ఉరిశిక్షను ఎదుర్కొంటున్నారు.