నేడు హుస్నాబాద్‌కు రానున్న కేసీఆర్‌

కరీంనగర్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ హుస్నాబాద్‌కు వెళ్లనున్నారు. హుస్నాబాద్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ నియోజక వర్గస్ధాయి శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలను ఉద్ధేశించి ఆయన ప్రసంగిస్తారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రాజకీయంగా ఎలా ఎదగాలో , రాజకీయ అధికారం ద్వారా తెలంగాణను ఎలా సాధిస్తామో ఆయన కార్యకర్తలకు వివరిస్తారు.