నేడు హైదరాబాద్‌కు అక్బరుద్దీన్
– ఉదయం నిర్మల్ కోర్టుకు
హాజరుహౖదరాబాద్, జనవరి 6 (జనంసాక్షి) :
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించిన ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం ఉదయం మూడు గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. లండన్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ జిల్లా కోర్టుకు హాజరవుతారు. ఆయన రాక సందర్భంగా నిర్మల్ పట్టణమంతా ఖాకీలమయమైంది. పోలీసులు బందోబస్తు చర్యలు పటిష్టం చేశారు.