నేడే కాకతీయ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష
వరంగల్, నవంబర్ 1 : కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఏర్సాటు చేసిన సమావేశంలో కాకతీయ ఉత్సవాల నిర్వహణతో పాటు డిసెంబర్ 27,28, 29 తేదీలో తిరుపతిలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల సమాయత్తంగా ఈ నవంబర్ నెలలో వరంగల్‌లో జిల్లా స్థాయి సాంస్కృతిక సదస్సులు, జిల్లా చరిత్ర సంస్కృతిపై సెమినార్, ప్రత్యేక సంచిక వెలువరించడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా అధికారులు విధిగా హాజరుకావాలని తెలిపారు.