నేడే నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభం
జనంసాక్షి రాజంపేట్
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఎంతగానో కృషి చేశారు. రాజంపేట్ మండలంలోని 8 గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలు ఎల్లారెడ్డి కి రావడానికి తీవ్రమైన ఇబ్బంది ఉందని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కామారెడ్డి నుంచి రాజంపేట్ గుండారం సిద్దాపూర్ మీదుగా ఎల్లారెడ్డి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ విషయంపై రాజంపేట్ మండల జడ్పీటీసీ కొండ హనుమాన్లు ప్రజలని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్ళడంతో ఎమ్మెల్యే దీనిపై కామారెడ్డి డిపో మేనేజర్ తో మాట్లాడి రోజుకి మూడు ట్రిప్పులు కామారెడ్డి టు ఎల్లారెడ్డి నడపాలని అన్నారు. ఎల్లారెడ్డి బోనాలు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.ఇదే సందర్భంగా నూతన బస్సును ప్రారంభోత్సవం చేశారు