నేతన్నలకు శుభవార్త.. రూ.30కోట్ల రుణమాఫీ
` తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు
` విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా వెసలుబాటు
` ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు
` నాంపల్లిలో ఐఐహెచ్‌టీని వర్చువల్‌గా ప్రారంభించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ విద్యార్థులకు హ్యాండ్లూమ్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం నాంపల్లిలో ఐఐహెచ్‌టీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఐహెచ్‌టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఏపీ, ఒడిశా రాష్టాల్రకు వెళ్లి హ్యాండ్లూమ్ కోర్సులు చదవాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడి ఐఐహెచ్‌టీకి అనుమతులు తెచుకున్నామని ఈ సందర్భంగా వెల్లడిరచారు. విద్యార్థుల సమయం వృథా కాకూడదని, తెలుగు యూనివర్శిటీలో ఐఐహెచ్‌టీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది ఐఐహెచ్‌టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని చెప్పారు. ఒక్కో విద్యార్థికి నెలకు 2500 స్టై ఫండ్ ఇస్తామని హావిూ ఇచ్చారు.గతంలో సినీ తళుకు బెళుకులు కూడా చేనేతకి తెచ్చారు. కానీ నేతన్నల రాత మారలేదు. గతంలో సిరిసిల్లలో కార్మికులకు బకాయిలు పెట్టారు. ఆ మొత్తం మేము అధికారంలోకి వచ్చాక విడుదల చేశాం. బతుకమ్మ చీరలకు కట్టుకునే స్థాయిలో నాణ్యత లేవు. మంచి డిజైన్‌తో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు ఒక్కొక్కరి ఏడాదికి 2 చీరలు ఇస్తాం. బతుకమ్మ చీరలు ఆగిపోయాయని ఆలోంచాల్సిన అవసరం లేదు అని రేవంత్ రెడ్డి అన్నారు. నేతన్నలకు రుణమాఫీ ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీకి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నామని అన్నారు. ‘ విూ సమస్యల పరిష్కారానికి విూ అన్నగా ఎప్పుడు ముందు ఉంటా. కొడంగల్ నియోజక వర్గంలోని నేతన్నలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. త్యాగాలు చేస్తే ఎలా వేలాది కోట్ల ఆస్తులు సంపాదించారు. పదవిని తృణప్రాయంగా త్యాగం చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ‘ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఐఐహెచ్‌టీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువ నీడ ఇచ్చారని సీఎం రేవంత్ తెలిపారు. నాంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని వర్చువల్‌గా ప్రారంభించారు. లలిత కళాతోరణంలో ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవం నిర్వహించారు. చేనేత అభయహస్తం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కార్యాలయం ఏర్పాటుకు కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారన్నారు. తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు. కానీ కొంత మంది రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు, ఉపఎన్నికలు తెచ్చారన్నారు. ఆ ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకొంటున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో పాంహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారన్నారు. కేసీఆర్, కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలకు తేడా గమనించాలన్నారు. ఉప ఎన్నికల్లో సెలక్షన్లు, కలెక్షన్లతో బాగుపడిరదెవరో ప్రజలకు తెలుసన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడూ గుర్తిస్తుందని చెప్పారు. ఐఐహెచ్‌టీకీ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకుందామన్నారు. ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని ప్రధాని, కేంద్రమంత్రులను కోరామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వారు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి తక్షణమే మంజూరు చేశారని చెప్పారు. నాంపల్లి తెలుగు వర్సిటీలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చేనేతల జీవన విధానంలో మార్పులు రాలేదు. సిరిసిల్ల నేతన్నలకు బకాయిలు చెల్లించలేదు. కాంగ్రెస్ వచ్చాక వెంటనే వాటిని విడుదల చేశాం. 63 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. చేనేతల రుణభారం రూ.30 కోట్లు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కుల, చేతి వృత్తులకు సముచిత న్యాయం చేస్తాం అని రేవంత్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యం గల చేనేత కళాకారులు, నూతన ఆవిష్కర్తల కోసం ఐఐహెచ్‌టీ ప్రారంభించారు. చేనేత రంగంలో ఆవిష్కర్తల ప్రోత్సాహానికి ప్రత్యేక కోర్సులు, శిక్షణ కార్యక్రమాలను ఇక్కడ అందించనున్నారు. అధునాతన పరిశోధన అవకాశాలను ఈ సంస్థ కల్పించనుంది. ఏటా 60 మందికి టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిఎª`లొమా కోర్సులు ఇవ్వనున్నారు. రైతన్న, నేతన్నలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చేనేత సమస్యలకు సాంకేతికతే ముఖ్య కారణం. చేనేత ఉత్పత్తులు ప్రపంచానికి ఎగుమతులు కావాలి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మన పిల్లలకు మన నైపుణ్యం అందించేందుకు ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేస్తాం. అతి తక్కువ సమయంలో కేవలం 10 రోజుల్లోనే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేశాం. ప్రస్తుతానికి ఐఐహెచ్‌టీ తరగతులు తెలుగు వర్సిటీలో అందిస్తున్నాం. త్వరలో ఐఐహెచ్‌టీని స్కిల్ వర్శిటీకి తరలింపు. నేతన్నల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి. చిన్న వయస్సులోనే రేవంత్ సీఎం అయ్యారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలని కృషి చేస్తున్నారని అన్నారు.
త్వరితగతిన గ్రీన్‌ఫార్మాసిటీ
` పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్(జనంసాక్షి): హైదరాబాద్ శివార్లలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గ్రీన్ ఫార్మా సిటీ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శషాంక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రంగారెడ్డి, మహబూబ్?నగర్? జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మా సిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. పర్యావరణ హితంగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అక్కడ అభివృద్ధికి అవసరమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు, తదితర మౌలిక సదుపాయాల నిర్మాణాలను వీలైనంత తొందరగా చేపట్టాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకొని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనులు చేయాలని సూచించారు. గ్రీన్ ఫార్మా సిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతామని సీఎం తెలిపారు. ఔషధాల తయారీ కంపెనీలు, బయోటెక్ డ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మా సిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. యాంటీ బయాటిక్స్, ఫెర్మంటేషన్ ఉత్పత్తులు, సింథటిక్ డ్రగ్స్, రసాయనాలు, విటమిన్లు, వ్యాక్సిన్లు, డ్రగ్ ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, హెర్బల్ ఔషధ ఉత్పత్తులు, ప్రత్యేక రసాయనాలు, కాస్మోటిక్స్ తదితర సంబంధిత ఉత్పత్తులన్నింటికీ ఫార్మా సిటీలో ప్రాధాన్యముంటుందని చెప్పారు. వీటితో పాటు పరిశోధన, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని అన్నారు. పరిశోధన, శిక్షణ, నైపుణ్యాలకు అవసరమైన ప్రత్యేక విశ్వ విద్యాలయం ఉంటుందని అన్నారు. హెల్త్ కేర్, ఫార్మా రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా అందులో కోర్సులు నిర్వహించాలని సూచించారు.