నేను ఇందిరమ్మ కోడలును.. ఎవరికీ భయపడను!

5

– ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా

– ఇది కక్ష సాధింపు చర్య

– నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై పార్లమెంట్‌లో ఆందోళన

– సోనియా, రాహుల్‌కు ఊరట

– ఈ నెల 19న కోర్టుకు హాజరుకావచ్చు

న్యూఢిల్లీ, డిసెంబర్‌8(జనంసాక్షి):నేను ఇందిరా గాంధీ కోడల్ని… నేనెందుకు అప్‌సెట్‌ అవుతాను..నేనెవరికీ భయపడను అని సోనియా గాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె ఈ విధంగా స్పందించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని సోనియా ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన అయిదువేల కోట్ల ఆస్తులు అక్రమంగా సొంతం చేసుకున్న కేసులో కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు మరికొందరు సీనియర్‌ నేతులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్‌తో పాటు మిగతా వాళ్లు కూడా ఖచ్చితంగా ఈ నెల 19న కోర్టుకు హాజరు కావాలంటూ ఇవాళ ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో బీజేపీ ప్రభుత్వం తమపై ప్రతీకార చర్యలకు దిగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇవాళ పార్లమెంట్‌ ఉభయ సభలను కూడా కాంగ్రెస్‌ ఎంపీలు అడ్డుకున్నారు.

అది ఎప్పటికీ నెరవేరబోదు: రాహుల్‌గాంధీ

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం తన పట్ల రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఈ కేసు ఎన్డీయే ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నదని ఆయన ధ్వజమెత్తారు. కక్షసాధింపు చర్యల ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించకుండా తనను అడ్డుకోవాలని వారు చూస్తున్నారని, ఇది ఎప్పటికీ జరుగబోదని ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ మంగళవారం పాటియాలా కోర్టు విచారణకు గైర్హాజరైన సంగతి తెలిసిందే. కోర్టుకు కచ్చితంగా హాజరుకావాల్సిందేనని న్యాయస్థానం ఆదేశించినా వారు హాజరుకాకపోవడం గమనార్హం. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా మంగళవారం రాహుల్‌ గాంధీ తమిళనాడులోని వరద బాధితులను పరామర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. మరోపక్క, ఈ కేసుకు సంబంధించి సోనియాగాంధీని జర్నలిస్టులు పలుమార్లు ప్రశ్నించడంతో  తాను ఈ విషయంలో ఏ విధంగాను స్పందిచబోనని ‘విూరయితే ఎలాంటి న్యాయం చెప్తారో చెప్పండి’ అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. ఈ కేసు వెనుక రాజకీయ పరమైన దురుద్దేశం ఉందన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ ఆంగ్ల దినపత్రిక నష్టాలతో 2008లో మూతపడింది. పత్రికకు చెందిన రూ.2,000 కోట్లను దుర్వినియోగం చేశారంటూ సోనియా, రాహుల్‌లపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కేసు వేసిన విషయం తెలిసిందే.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై కాంగ్రెస్‌ ఎంపిల నిరసన

పార్లమెంటు ఉభయ సభలను ఇవాళ కాంగ్రెస్‌ ఎంపీలు అడ్డుకున్నారు. తమపై కేంద్ర ప్రభుత్వం రాజకీయ కుట్ర పన్నినట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలను ప్రభుత్వం కావాలనే ఇరికిస్తోందని ఎంపీలు సభలను స్తంభింపచేశారు. లోకసభ, రాజ్యసభలోనూ కాంగ్రెస్‌ ఎంపీలు నినాదాలతో ¬రెత్తించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. దీంతో ఉభయ సభలను వాయిదా వేశారు. పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం నడుమ మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్‌ ఉభయ సభల్లో నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపైన చర్చించాల్సిందిగా కాంగ్రెస్‌  డిమాండ్‌ చేయటంతో కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభలో నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై కాంగ్రెస్‌ చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభ మధ్యాహ్నం 12.30 గంటల వరకు వాయిదా పడింది. అదేవిధంగా లోకసభలోనూ అదేవిషయంపై చర్చించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేయడంతో లోకసభ కూడా  మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వం కాంగ్రెస్‌ ఆరోపణలను తిప్పికొట్టింది. తాము రాజకీయ కుట్రకు పాల్పడలేదని బీజేపీ తేల్చి చెప్పింది. కేసు కోర్టులో ఉంటే పార్లమెంట్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. తాను ఇందిరా గాంధీ కోడల్ని. నేనెందుకు అప్‌సెట్‌ అవుతాను. తానెవరికీ భయపడను అని సోనియా గాంధీ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు ఆమె పై విధంగా స్పందించారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని సోనియా ఆరోపించారు. నేషనల్‌ హెరాల్డ్‌కు సంబంధించిన అయిదువేల కోట్ల ఆస్తులు అక్రమంగా సొంతం చేసుకున్న కేసులో కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పాటు మరికొందరు సీనియర్‌ నేతులు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిధుల దుర్వినియోగం కేసులో సోనియా, రాహుల్‌తో పాటు మిగతా వాళ్లు కూడా ఖచ్చితంగా ఈ నెల 19న కోర్టుకు హాజరు కావాలంటూ మంగళవారం  ఢిల్లీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. దీంతో బీజేపీ ప్రభుత్వం తమపై ప్రతీకార చర్యలకు దిగుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇవాళ పార్లమెంట్‌ ఉభయ సభలను కూడా కాంగ్రెస్‌ ఎంపీలు అడ్డుకున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ గాంధీకి కాస్త ఊరట లభించింది. కోర్టు విచారణను న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే ఢిల్లీ హైకోర్టు ఇవాళ తీర్పును వెల్లడించింది. వాస్తవానికి ఈ కేసులో సోనియా, రాహుల్‌ గాంధీలు మంగళవారం కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. నిధుల దుర్వినియోగం కేసులో వ్యక్తిగత మినహాయింపు కావాలంటూ ట్రయల్‌ కోర్టు సమన్లను సవాల్‌ చేసిన కాంగ్రెస్‌ నేతలకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అయితే మెజిస్ట్రేట్‌  మారడంతో పరిస్థితి తారుమారైంది. తమకు సమన్లు ఆలస్యంగా అందినట్లు కాంగ్రెస్‌ నేతలు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సోనియాకు వెసలుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కావాలనే చేస్తున్‌ఆనరని, కాంగ్రెస్‌ను వేదించే పనిలో భాగమని కాంగ్రెస్‌ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి అన్నారు. దీనిని ఎదుర్కొంటామని అన్నారు. అయితే ఆధారాలను కోర్టుకు సమర్పించామని కేసు వేసిన సుబ్రమణ్య స్వామి తెలిపారు. ఇదిలా వుండగా బీజేపీపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందన్నారు. మోడీ సర్కార్‌ నియంతృత్వ పాలనకు తెర తీసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌ చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని కపిల్‌ సిబాల్‌ మండిపడ్డారు. సుబ్రమణ్యస్వామికి బీజేపీ ఈ బాధ్యతలు అప్పగించిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు. కేవలం కాంగ్రెస్‌ను బెదిరించాలన్న ధోరణిలో ఉన్నారని అన్నార. వీరి ఆటలుసాగవన్నారు.