నేను పంజాబీని
– నా రాష్ట్రం నుంచి దూరం చేసేందుకు భాజాపా కుట్ర చేసింది
– అందుకే రాజీనామా చేశాను
నవజ్యోత్ సింగ్ సిద్ధూ
న్యూఢిల్లీ,జులై 25(జనంసాక్షి): రాజ్యసభకు రాజీనామాపై క్రికెటర్, బిజెపి నాయకుడు నవజోత్ సింగ్ సిద్దూ పెదవి విప్పారు. బీజేపీకి షాక్ ఇచ్చి ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అమృత్‌సర్ మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తొలిసారిగా స్పిందించారు. తనను పంజాబ్ కు దూరం చేయాలని అనుకున్నారని,అందుకే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాననిసిద్దూ చెప్పారు. విూడియాతో ఆయన మాట్లాడారు.మాతృభూమిని ఎలా మర్చిపోతామని అన్నారు. పక్షులు కూడా తమ గూడును వదలవని ఆయన అన్నారు.తాను నాలుగుసార్లు ప్రజల నుంచి గెలిచానని ఆయన గుర్తు చేశారు. అమృతసర్‌లో తాను గెలిచిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పంజాబ్ కంటే తనకు ఏ పదవి గొప్పది కాదని సిద్దూ అన్నారు. పంజాబ్ వైపు చూడవద్దని తనను బిజెపి నాయకత్వం కోరిందని సిద్దూ అన్నారు. అందువల్లనే తాను రాజ్యసభకు , బిజెపికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన వివరాలను సోమవారం విూడియా సమావేశంలో వెల్లడించారు. ‘దేశభక్తి గల పక్షి కూడా తన చెట్టును వదిలిపోదు. నా మూలాలు పంజాబ్‌లోనే ఉన్నాయి. నేను అమృత్‌సర్‌ను వదలి ఎలా వెళ్లగలను? అసలు ఎందుకు వదిలి వెళ్లాలి? నా తప్పేంటి?’ అని సిద్ధూ ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పంజాబ్ ప్రయోజనాల పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నానని, దానికి ఎవరైతే కట్టుబడతారో తాను అక్కడకు వెళ్తానని చెప్పుకొచ్చారు. పంజాబ్ కోసం తాను ఎలాంటి కష్టనష్టాలకైనా భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఇక్కడి ప్రజలను ఎలా వదులుకుంటాను. ఇక్కడ నుంచి నేను నాలుగు సార్లు ఎంపీగా గెలిచాను. మొదటి సారి అంటే సెలబ్రిటీని కాబట్టి గెలిచానుకోవచ్చు.. తర్వాత నేను ప్రజలకు చేసిన మంచి వల్లే గెలిచాను. నాలుగు సార్లు గెలిచిన తర్వాత పంజాబ్ నుంచి దూరంగా ఉండమన్నారు. ఎందుకు అని నేను అడిగాను. నేను ఏం తప్పు చేశానని ప్రశ్నించాను. బిజెపి ఇలా చేయడం మొదటిసారి అయితే.. పొరపాటు అని వదిలేసేవాడిని. కానీ ఇది మూడు లేదా నాలుగో సారి అంటూ వివరించారు సిద్దు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని కురుక్షేత్ర నుంచి, లేదంటే పశ్చిమ దిల్లీ నుంచి పోటీ చేయమన్నారు. నేను అంగీకరించలేదు. నేను ఎల్లప్పుడూ పంజాబ్, అమృత్‌సర్‌లకే సేవ చేయాలనుకుంటున్నాను. నవజ్యోత్ ప్రస్తుతం ఎంపీ పదవికి రాజీనామా చేశారు కానీ భాజపా నుంచి రాజీనామా చేయలేదు. ఆయన భాజపాను వీడి ఆమ్ ఆద్మీ
పార్టీలో చేరతారని ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే సిద్ధూ విూడియా సమావేశంలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. భాజపాను వీడే అంశంపైనా, ఆప్‌లో చేరే అంశంపైనా ఏవిూ మాట్లాడలేదు. విలేకరులు ఆప్‌లో చేరే అంశంపై ప్రశ్నించినప్పటికీ ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు. దీంతో ఈ విషయంలో ఇంకా సందిగ్ధత వీడలేదు. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ మాత్రం తాను భాజపాను వీడేది లేదని గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధూ చేరవచ్చని, ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆయనను బరిలోకి దింపే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పంజాబ్‌లో ఈసారి త్రిముఖ పోటీ ఉండబోతోంది. అధికార శిరోమణి అకాదళ్, బీజేపీ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్, కొత్తగా ఎన్నికల సవాల్ విసురుతున్న ఆప్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందంటున్నారు.