నేను మంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేది కాదు

4
– ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్‌ ఎందుకు తాగావు?

– ఉద్యమ ప్రయోజనాల కోసం నిన్ను నిలదీయలేదు

– కేసీఆర్‌పై ఎస్‌.జైైపాల్‌ రెడ్డి ఫైర్‌

హైదరాబాద్‌,నవంబర్‌18(జనంసాక్షి):

ఉమ్మడి రాష్ట్రాకి ముఖ్యమంత్రిని అయ్యే అవకాశం వచ్చినా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ పదవిని తీసుకోలేదని కాంగ్రేస్‌ జాతీయ నాయకులు,కేంద్రమాజీమంత్రి  జైపాల్‌ రెడ్డి వెల్లడించారు. తాను ఆనాడు సిఎం అయివుంటే తెలంగాణ వచ్చి వుండేది కాదన్నారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ వరంగల్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందనే భయంతోనే కేసీఆర్‌ విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే అవగాహన ఉందన్నారు. ఉద్యమంలో భాగంగా తనను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయలేదని విమర్శిస్తున్నారనీ.. ఒకవేళ తాను అలా చేసి ఉంటే హైదరాబాద్‌తో  కూడిన తెలంaగాణ ఏర్పడి ఉండేది కాదని జైపాల్‌ రెడ్డి వివరించారు. తెలంగాణ సాధన లక్ష్యంలో భాగంగానే తాను ఆనాడు రాజీనామా చేయాలేదన్నారు. ఊహకందని అసత్యాలు, అబద్ధాలతో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారని  జైపాల్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ నిరాహారదీక్ష ఎలా చేశారో అందరికీ తెలుసన్నారు. అసలు కేసీఆర్‌ దీక్షను ఎందుకు విరమించారో, జ్యూస్‌ ఎందుకు తాగారో  ఇంతవరకూ వివరణ ఇవ్వలేదన్నారు.పజాసంఘాల ఒత్తిడి మేరకే…భయపడి కేసీఆర్‌ తిరిగి దీక్షను కొనసాగించారని ఆరోపించారు. కేసీఆర్‌ దీక్ష మర్మాన్ని త్వరలో వెల్లడిస్తానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్ర చాలా ఉందని… తెలంగాణ కోసం కాంగ్రెస్‌ ఎంపీలను ఏకతాటిపై నడిపించానన్నారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసివుంటే తెలంగాణ వచ్చేదేకాదని జైపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వాదం వేరు,జాతీయవాదం వేరని, తాను ఎప్పడూ జాతీయవాదినేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే కేసీఆర్‌ను నిలదీయలేదని జయపాల్‌రోడ్డి అన్నారు.