నేపాల్‌కు పూర్తి సహకారం

1

– ప్రకంపనల వల్ల దేశంలో 72 మంది మృతి

– లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌27(జనంసాక్షి):

వరుస భూప్రకంపనలతో అత్యంత దారుణ స్థితి లో కూరుకుపోయిన నేపాల్‌కు భారత్‌ అన్ని రకా లుగా సహకరిస్తుందని భారత ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు.  అలాగే ఆ దేవా న్ని అన్నవిధాలుగా ఆదుకుంటామన్నారు. భూ కంపం వల్ల భారత దేశంలో మొత్తం 72 మంది చనిపోయారని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. నేపాల్‌లో భూకంపంపై సోమ వారం  లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సభలో ప్రకటన చేశారు. నేపాల్‌లో భూకంపం రాగానే ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారని, సహాయ చర్యలకోసం రాష్టాల్రను సమన్వయం చేసుకున్నామని ఆయన చెప్పారు. వెంటనే స్పం దించిన ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ సీఎం లకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. భూకంపం వల్ల దేశంలో 72 మంది మృతిచెందారని, బిహా ర్‌కు 4, యూపీకి ఒకటి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాల్ని పంపామని ¬ంమంత్రి తెలిపారు. నేపాల్‌ నుంచి భారత్‌ వచ్చేందుకు విదేశీయులకు వీసా ఇచ్చామన్నారు. ప్రధాని వ్యక్తిగతంగా ఎప్పటిక ప్పుడు సవిూక్షిస్తున్నారని

ఆయన తెలిపారు. అలాగే సహాయక బృందాలను పంపి నేపాల్‌ను ఆదుకుంటున్నామని అన్నారు. నేపాల్‌ కేవలం తమ పొరుగు దేశమే కాదు.. ఆ దేశంతో తమకు ఎన్నో రకాల సాంస్కృతిక సంబంధాలున్నాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. కష్టకాలంలో నేపాల్‌కు అండగా ఉంటామన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమై నేపాల్‌కు పూర్తి సహాకారం అందించేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. భారత్‌లో భూకంప ప్రభావం ఉన్న ప్రాంతాల గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటోందని రాజ్‌నాథ్‌ స్పష్టంచేశారు. ప్రధాని మోదీ ఆయా రాష్టాల్ర  ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు తెలిపారు. నేపాల్‌ బాధితులకు వీలైనంత సహాయం చేస్తామన్నారు. భూకంపం బారిన పడ్డ నేపాల్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర ¬ంమంత్రి పార్లమెంటులో ప్రకటన చేశారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలతో బాధితులకు అన్నీ సేవలు

అందిస్తున్నామని చెప్పారు. సాధారణ స్థితి వచ్చేవరకు సహాయక చర్యలు కొనసాగుతాయని రాజ్‌నాథ్‌ అన్నారు.

నేపాల్‌ భూకంప మృతులకు పార్లమెంట్‌  సంతాపం

నేపాల్‌ భూకంప మృతులకు లోక్‌సభ సంతాపం తెలిపింది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ సుమిత్రా మహజన్‌…. సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్‌ రాజధాని ఖట్మాండు కేంద్రంగా నమోదైన భూ కంపం వేలాది మంది ప్రాణాలు బలితీసుకుందని…మరెంతో మందిని గాయాలపాలు చేసిందని అందులో పేర్కొన్నారు. భూ కంప తీవ్రత నేపాల్‌తో పాటు భారత్‌లోని పలు రాష్టాల్ల్రో పడిందని అన్నారు.  జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని… తీవ్ర ఆవేదనకు గురిచేసిందని స్పీకర్‌ తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని…నేపాల్‌ దేశం త్వరలోనే కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులంతా కొద్దిసేపు మౌనం పాటించారు. అటు రాజ్యసభ కూడా నేపాల్‌ మృతులకు సంతాపం ప్రకటించింది. సభ ప్రారంభమైన వెంటనే చైర్మన్‌ హమిద్‌ అన్సారీ… సంతాప తీర్మానం చదివి వినిపించారు. నేపాల్‌ రాజధాని ఖట్మాండ్‌ కేంద్రంగా నమోదైన భూ కంపం….తీవ్ర ప్రభావం చూపిందని, ఇలాంటి సమయంలో అందరూ బాధితులకు అండగా ఉండాలని అందులో పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని…త్వరగా నేపాల్‌ తిరిగి కోలుకోవాలని కాంక్షిస్తూ సభ్యులందరూ కొద్దిసేపు మౌనం పాటించారు.

నేపాల్‌ మృతులకు దలైలామా సంతాపం

నేపాల్‌లో భూకంపం సృష్టించిన పెను విధ్వంసం విచారకరమని బౌద్ధమత గురువు దలైలామా అన్నారు. భూకంప మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. నేపాల్‌, టిబెట్‌ చాలా కాలంగా ఇరుగుపొరుగు దేశాలని, అనేకమంది టిబెటియన్లు నేపాల్‌లో నివాసముంటున్నారని ఈ సందర్భంగా ఆయన నేపాల్‌ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.