నేపాల్‌ చేరుకున్న భారత సహాయ బృందాలు

5

ఖాట్మండు, ఏప్రిల్‌ 26 (జనంసాక్షి): నేపాల్‌ లో సహాయక చర్యల కోసం 13 ఎయిర్‌ క్రాఫ్టులను పం పామని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్‌ చెప్పారు. ఇప్పటికే ఈ బృందాల ఖాట్మండు చేరుకు న్నాయి. మరో మూడు జాతీయ విపత్తు నిర్వహణ బృందాలను కూడా పంపిస్తున్నట్టు ప్రకటించారు. ఇవాళ రెండు టన్నుల వైద్య సామాగ్రిని పంపిం చినట్టు ఆయన వెల్లడించారు. రానున్న 48 గంటల్లో మరో 6 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిస్తామ న్నారు. బీహార్‌ లో 4, యూపీలో ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఉందని జైశంకర్‌ వివరించారు. నేపాల్‌ లో భారత్‌ చేపట్టిన సహాయక చర్యలపై ప్రధాని మోడీ సవిూక్షించిన తర్వాత జైశంకర్‌ విూడియాతో మాట్లాడారు.నేపాల్‌ నుంచి రెండు పౌర విమానాల ద్వారా భారతీయులను తీసుకొస్తున్నామని విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు. రోడ్డు మార్గం ద్వారా కూడా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చ ెప్పారు. ఖాట్మండుకు వెళ్లే రెండు రోడ్డు మార్గాలు రవాణాకు అనుకూలంగా ఉన్నాయన్నారు.భూకంపం వల్ల భారత్‌ లో 62 మంది మృతి చెందారని, 259 మందికి గాయపడ్డారని జైశంకర్‌ ప్రకటించారు. నేపాల్‌ నుంచి 540 మందిని భారత్‌ కు తరలించామన్నారు. నేపాల్‌ లో ఇద్దరు భారతీయులు చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు. భూకంప మృతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచినట్టు జైశంకర్‌ వెల్లడించారు.