నేపాల్‌ శవాల దిబ్బ

5

6

– 4 వేలు దాటిన మృతుల సంఖ్య

-సహాయ చర్యలకు వర్షం అడ్డంకి

ఖాట్మండ్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి):నేపాల్‌లో వరుస గా మూడోరోజు కూడా ప్రకంపనలు భయాందోళనకు గురి చేశాయి. సోమవారం ఉదయం మరోమారు ప్రకంపనలు వచ్చాయి.  మూడు రోజుల నుంచి ఖా ట్మండ్‌ను భూ ప్రకంపనలు అతలాకుతలం చేస్తున్నా యి. సోమవారం ఉదయం  కూడా నేపాల్‌లో స్వల్పం గా భూమి కంపించడంతో పాటు సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం అడ్డంకి సృష్టిస్తోంది.వర్షం కారణంగా సహాయక చర్యలు నెమ్మదించాయి. దీనికి తోడు కరెంట్‌ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  భూకంప ధాటికి వందల సంఖ్యలో భవనాలు, నివా సాలు కుప్పకూలిపోయాయి. సుమారు 3,200 మంది మృత్యువాత పడ్డారు. 6,500

మంది క్షతగాత్రుల య్యారు. దేశ రాజధాని ఖాడ్మండు దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం 6:09 గంటలకు మళ్లీ ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ కంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై

4.2గా నమోదు అయ్యింది. భూ ప్రకంపనలతో రాత్రి నుంచి నిద్రలేకుండా గడిపిన ప్రజలు ఈ ఉదయం మరోసారి భూమికంపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. రహదారులపైనా కాలం గడుపుతున్న ప్రజలు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాగ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. ఆరుబయట మైదాన ప్రాంతాల్లో పడుకున్నారు. భూప్రకంపనల నేపథ్యంలో నేపాల్‌ వాసులు ఆరు బయటే ఆశ్రయం పొందుతున్నారు. మైదాన ప్రాంతాల్లో డేరాలు వేసుకుని జీవనం గడుపుతున్నారు. వేల మంది తిండి కోసం తిప్పలు పడుతున్నారు. వంట సామాగ్రి ఉన్న వారు వంటలు చేసుకుంటున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, భూకంపాలు రావొద్దని పలువురు ప్రార్థిస్తున్నారు. వర్షం కూడా పడుతుండటంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నేపాల్‌లో భూకంప మృతుల సంఖ్య 3,218కి పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 5వేల మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్య బృందాలు ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి.  భూకంపం కారణంగా నేపాల్‌లో వారం రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అలాగే నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించే పక్రియ వేగంగా సాగుతోంది. ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌ విమానాలు సోమవారం  ఉదయానికి 1935 మందిని స్వదేశానికి చేర్చినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ భూకంపానికి విలవిల్లాడుతున్న నేపాల్‌కు మరో ముప్పు పొంచిఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వచ్చే 24 గంటల్లో నేపాల్‌ భారీ వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉన్నదని పేర్కొన్నది. రెండు, మూడు రోజులపాటు వర్షాలు పడుతాయని హెచ్చరించింది. దీంతో శిథిలాల తొలగింపు పనులకు ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని నేపాల్‌ ప్రభుత్వం భయాందోళనలు చెందుతున్నది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

టికెట్‌ ధర తగ్గించిన ఎయిరిండియా

నేపాల్‌ వెళ్లే ప్రయాణికులకు ఎయిరిండియా భారీగా టికెట్‌ ధరలు తగ్గించింది. దిల్లీ నుంచి నేపాల్‌ వెళ్లేందుకు టికెట్‌ ధర రూ.14వేల నుంచి రూ.4,700 వరకు తగ్గించినట్లు ఎయిరిండియా ప్రకటించింది.