నేరేడుచర్ల రాఘవేంద్ర రైస్ మిల్లులో వేబ్రిడ్జ్ కాంటల్లో మోసం.

*ఒక ట్రాక్టర్ ధాన్యం లోడులో 10 క్వింటాల పైనే మాయం.

రైస్ మిల్లు ఎదురుగా రైతులు ఆందోళన.

 

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ఆరు కాలం కస్టపడి పండిచిన పంటను అమ్ముకునేందుకు మిల్లుల వెళ్లగా అక్కడ రైతులకు వేబ్రిడ్జి ద్వారా మోసం చేసిన ఘటన పట్టణంలో జాన్ పహాడ్ రోడ్డు లో ఉన్న రాఘవేంద్ర వేబ్రిడ్జిలో చోటు చేసుకుంది. ఈ సందర్బంగా రైతులు తెలిపిన వివరాల ప్రకారం పాలకవీడు మండల పరిధిలోని బోత్తల పాలెం గ్రామానికి చెందిన రైతు సైదిరెడ్డి మంగళవారం 8 ట్రాక్టర్లలో ధాన్యంను తీసుకురాగా ఒక్కో ధాన్యం లోడుల్లో 10 క్వింటాళ్ల ధాన్యం తక్కువ తూకం చూపించినట్లు గమనించిన రైతులు మిల్లర్ యజమానినీ ప్రశ్నించారు. వారు టెక్నికల్ లోపం అంటు తపించుకుంట్టున్న మిల్ యజమానులు.టెక్నికల్ లోపం అయితే ఇన్ని బండ్లకు ఆన్నిసార్లు ఎలా తేడా వస్తుందని ప్రశ్నించిన రైతులు.ఉదయం నుంచి వచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అని అగ్రహించిన అన్నదాతలు.ఇలా ఎన్ని రోజుల నుంచి జరుగుతుందని రైతులు నేరేడుచర్ల టుజాన్ పహాడ్ రహదారి పై కూర్చుని బైటా ఇంచారు. గత యాసింగిలోనూ ఇలానే కాంటాలో తేడా వచ్చిందని చెబుతున్న ఎల్బీనగర్ రైతు.విషయం తెలుసుకున్న సీఐ రామలింగారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ఎస్ఐ నవీన్ కుమార్ అధ్వర్యంలో కంటా లో జరిగిన మోసాన్ని ప్రత్యక్షంగా చూశారు. మోసం చేసిన రైస్ మిల్లు పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నదాతలకు హామీ ఇచ్చారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామలింగారెడ్డి తెలిపారు.అనంతరం అన్నదాతలు మాట్లడుతూ ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అసలే తక్కువ దిగుబడి వచ్చి ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం మిల్లులల్లో ఉన్న సొంత కంటాల్లో ఇలా మోసం జరిగితే మీమెట్ల బతకాలంటు రైతులు వాపోయారు. రైతులను మోసం చేసిన వారు ఎవ్వరు కూడా బాగు పడరు అని విమర్శించారు. మండల వ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లులాల్లో కంటా లను చెకింగ్ చేసి తూకం లో మోసాలకు పాల్పడుతున్న మిల్లులను వెంటనే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.