నేషనల్ హైడ్రాలజి ప్రాజెక్ట్ ప్రారంభించనున్న జిల్లా కలెక్టర్

వెల్దండ డిసెంబర్ 2 జనం సాక్షి:

నేషనల్ హైడ్రాలజ ప్రాజెక్ట్ (NHP) లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో భూగర్భ జల మట్టముల సేకరణ మరియు లెక్కింపు పరిధిని విస్త్రుతం చేయుటకు భూగర్భ జల శాఖ ద్వారా నూతనంగా 30 పిజోమీటర్లను (నీటి మట్టము కొలిచే పరిశీలక బోరు బావి) నిర్మించి అందులో డిజిటల్ వాటర్ లెవెల్ రికార్డర్ (DWLR) లను ఏర్పాటు చేయుచున్నారు. నూతన సాంకేతిక విధానం ద్వార ఖచ్చితమైన భూగర్భ జల నీటి మట్టము ప్రతి ఆరు గంటలకొకసారి నమోదు చేయబడుతాయి.

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా కలెక్టర్   ఉదయ్ కుమార్  టి ఎస్ ఎస్ పి సి డి సి ఎల్, 33/11 కె వి విద్యుత్ ఉపకేంద్రం, భైరాపూర్ గ్రామం వెల్దండ మండలం లో బోరు బావుల డ్రిల్లింగ్ కార్యక్రమంను ప్రారంభించనున్నారని జిల్లా భూగర్భ జల వనరుల శాఖ అధికారిని రమాదేవి తెలిపారు.

తాజావార్తలు