నోటిఫికేషన్‌ లేకుండా 30వేల ఉద్యోగాలా!

` అది ఎలా సాధ్యమైంది? కేటీఆర్‌
` నిరుద్యోగుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ విధానాలు
` ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ భృతి కానరాదు
` ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌
నల్లగొండ(జనంసాక్షి):ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రశ్నించారు.నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లలో భారాస ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలన్నారు. ‘’అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. భారాస ప్రభుత్వం పనిచేసి కూడా చెప్పుకోలేకపోయింది.నిరుద్యోగుల పాలిట శాపంగా మారిన కాంగ్రెస్‌ పార్టీ తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. 2 లక్షల ఉద్యోగాల మాటే లేదు.. నిరుద్యోగ భృతి ఊసే లేదు అని కేటీఆర్‌ మండిపడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఖమ్మం` వరంగల్‌ `నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి మద్దతుగా కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు.ఖమ్మం ? నల్లగొండ ? వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 4 లక్షల 70 వేల మంది పట్టభద్రులు ఉన్నారు. మరి అరచేతిలో వైంకుఠం చూపెట్టి మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటేద్దామా..? పదేండ్ల పాటు నిజాయితీగా పని చేసిన బీఆర్‌ఎస్‌కు ఓటెద్దామా..? ఒక గోల్డ్‌ మెడల్‌ సాధించి ప్రజాసేవకు అంకితమైన రాకేశ్‌ రెడ్డికి ఓటేద్దామా..? విూడియా, యూట్యూబ్‌ అడ్డం పెట్టుకుని దందాలు చేసే చీటర్లకు ఓటేద్దామా..? అనేది ఆలోచించాలని పట్టభద్రులకు కేటీఆర్‌ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ ప్రకారం.. జాబ్‌ క్యాలెండర్‌ లేదు. మెగా డీఎస్సీ ముచ్చటనే లేదు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని రేవంత్‌ అంటున్నాడు. కానీ రేవంత్‌ రెడ్డి వచ్చాక ఒక్క నోటిఫికేషన్‌ కూడా రాలేదు. ఉద్యోగాలు ఇచ్చామని డైలాగులు కొడితే నమ్మేందుకు మనం పిచ్చొళ్లామా..? కాంగ్రెస్‌ చెప్పిన 2 లక్షల ఉద్యోగాల మాటే లేదు. విూ తరపున కొట్లాడాలి అంటే మాకు బలమివ్వాలి. కానీ బాకాలు ఊదేవాళ్లకు కాదు అని కేటీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం ఐదు నెలల్లో అన్ని వర్గాలను మోసం చేసింది. ఐదు నెలల్లోనే ఐదేండ్ల అపఖ్యాతిని మూటగ్టటుకుంది కాంగ్రెస్‌ ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఉన్న పరిస్థితిని చెడగొట్టుకున్నామని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడైనా ఆలోచించి ఓటేయండి.. ఆగం కాకండి. ఎవరి వల్ల లాభం జరుగుతదో ఆలోచించాలి. బ్లాక్‌ మెయిలర్లు, దందాలు చేసేటోళ్లకు అవకాశం ఇస్తే సమాజానికి తీవ్ర నష్టం. సన్న వడ్లకు మాత్రమే బోనస్‌ ఇస్తామని సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలంటే గ్రాడ్యుయేట్లు సరైన తీర్పునివ్వాలి. ఈ ఎన్నికల్లో రాకేశ్‌ రెడ్డికి ఆశీర్వాదం ఇస్తే ప్రభుత్వం నిలదీసే అవకాశం ఉంటుంది అని కేటీఆర్‌ అన్నారు.
బోనస్‌ ఓ బోగస్‌
కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ప్రచారంలో ప్రతిగింజకు బోనస్‌ అని ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అంటారా? అని ప్రశ్నించారు. ఇది కపట కాంగ్రెస్‌ మార్కు మోసం, దగా, నయవంచన అన్నారు. నీరివ్వరు.. కరెంట్‌ ఇవ్వరు.. పంట కూడా సరిగా కొనుగోలు చేయరా? అని నిలదీశారు. రూ.15 వేలు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఏం అయ్యాయన్నారు. నమ్మి ఓట్లేస్తే గొంతు కోస్తున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ప్లలెప్లలెనా ప్రశ్నిస్తారు.. రైతన్నలతో కాంగ్రెస్‌ కౌంట్‌డౌన్‌ మొదలైందని పేర్కొన్నారు. ఆ పార్టీది ఓట్ల నాడు ఓ ముచ్చట.. నాట్లనాడు ఓ ముచ్చట అని ఎద్దేవా చేశారు. ప్రతి రైతుకు డిసెంబర్‌ 9నే రూ.2 లక్షల రుణమాఫీ అన్నారని.. ఇంకా అమలు చేయలేదని చెప్పారు. నేడు బోనస్‌ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్‌ విధానాన్ని బయట పెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గాలిమాటలతో గారడీ చేసిందని, లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే తన నిజస్వరూపాన్ని బయటపెట్టిందని విమర్శించారు.