న్యాయం చేయండి.. సింగరేణి నిర్వాసితుని ఆవేదన
న్యాయం చేయండి.. సింగరేణి నిర్వాసితుని ఆవేదన
మంథని, జనంసాక్షి, అక్టోబర్ 26 : పెద్దపల్లి జిల్లా మంథని మండలం అక్క పెళ్లి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్, మంథని ఆర్డిఓ అధికారులు కుమ్మక్కై తనకు అన్యాయం చేశారని అక్క పల్లి గ్రామ పంచాయతీలోని సిద్దపల్లికి చెందిన ఎండి రియాజ్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. గురువారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. సిద్ధపల్లిలో 2010 నుండి నివాసం ఉంటున్న నాకు ముందుగా సింగరేణి అధికారులు చెల్లించే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మొదటి విడత స్ట్రక్చర్ పేమెంట్ 11 లక్షల 72 వేల రూపాయలు చెల్లించిన అధికారులు తదుపరి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లించడం లేదని ఆయన గ్రామ సర్పంచ్ తో పాటు అధికారులపై తీవ్ర విమర్శలు చేశాడు. సర్పంచ్ రెవెన్యూ అధికారులు కుమ్మక్కై తనకు రావలసిన ప్యాకేజ్ మరొకరికి నస్పూరి రాజమ్మ భర్త పేరు పోచాలు అనే వారికి కేటాయించినట్లు ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పూర్తి విచారణ చేపట్టి తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. తనకు న్యాయం జరగని ఎడల ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన తెలిపారు