న్యాయపరమైన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి: ప్రసాదరావు
హైదరాబాద్: న్యాయపరమైన సమస్యలను అతి త్వరగా పరిష్కరించాలని మంత్రుల కమిటీ నివేదికలో సూచించినట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించామని ఆయన అన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విశ్వాసం చూరగొనే వ్యూహం రూపొందించుకోవాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.