న్యాయవాది సంగెం సుదీర్ కుమార్ కు అరుదైన గౌరవం

ఇచ్చోడ నవంబర్ 1 (జనంసాక్షి ) ఇచ్చోడ
ఆదిలాబాద్ న్యాయవాదికి అరుదైన అవకాశం…. వివిధ రంగాల్లో రాణిస్తూ పేద ప్రజల కన్నీళ్లు తుడిచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వచ్చంద సంస్థలకు, వ్యక్తులను హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభ లో అంగరంగ వైభవంగా అవార్డులను ప్రధానం చెయ్యడం జరిగింది, ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది సుధీర్ కుమార్ సంగెం, సంగెం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దానికి గాను జాతీయ స్థాయి లో తెలంగాణ భాషా సంస్కృతి మరియు సత్య సంగీత ఇంటర్నేషనల్ సంస్థలు ‘జాతీయ స్థాయి సేవా రత్న,..2022’ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్య సంగీత సంస్థ అధ్యక్షులు ఓంకార్ రాజు గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ. వేణు గోపాల చారి గారు, సినీ నిర్మాత వాకులభరణం గారు, సినీ తారలు ఊర్వశి, లక్ష్మి వర్మ, రేవతి, అర్చన తదితరులు పాల్గొన్నారు ఆదిలాబాద్ వాసికి  జాతీయ స్థాయి లో అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తపరిచారు, అవార్డు రావడం వల్ల ఇంకా భాద్యత పెరిగిందని న్యాయవాది సుధీర్ కుమార్ పేర్కొన్నారు, దీనికి కారకులైన అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలిపారు

తాజావార్తలు