న్యాయవాది హత్యకు నిరసనగా విధులు బహిష్కరణ
ఎల్లారెడ్డి 16 ఆగస్ట్ జనంసాక్షి (టౌన్)
నల్గొండ జిల్లాలో న్యాయవాది గాదె విజయరెడ్డి హత్యకు నిరసనగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో మున్సిప్ కోర్ట్ ఆవరణలో మంగళవారం నాడు ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగిపోతున్నాయని, వాటిని నిరోధించడానికి అడ్వకేట్ ప్రొటెక్ట్ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయవాది విజయ రెడ్డిని హత్య చేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు పద్మ పండరి,గోపాలరావు, సతీష్, వీరయ్య, ఇమాన్యుల్, సాయిబాబా, శ్రీనివాస్, గౌస్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
