న్యాయవాదుల విధుల బహిష్కరణ

మెట్‌పల్లి : చలో అసెంబ్లీకి సంఘీభావంగా మెట్‌పల్లి కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. హైదరాబాద్‌ తరలి వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కోర్టు ఎదుట నినాదాలు చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కార్యదర్శి భానుమూర్తి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.