న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం

విజయనగరం: న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం వల్ల వేగవంతంగా, సులువుగా, సమర్థంగా కేసుల పరిష్కారం జరుగుతుందని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి విజయనగారం జిల్లా పోర్టు పోలియో జడ్జి నౌషద్‌ అలీ అన్నారు. విజయనగరంలోని న్యాస్థానాల భవన సముదాయ ప్రాంగణంలో ఈరోజు జుడిషియల్‌ సర్వీసు సెంటరును ఆయన ప్రారంభించారు. కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యానికి కారణాలతో పాటు ప్రధానంగా మౌలిక వసతుల లేమి కూడా ఉందని అభిప్రాయపడ్డారు. న్యావాదుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తారని బార్‌ ఆసోసియేషన్‌ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. ఇ కోర్టు సేవలను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సుప్రీం కోర్టు ప్రయత్నం చేస్తోందన్నారు.

తాజావార్తలు