న్యాయ సేవలు ప్రజల సాధికారత పై అవగాహన 

పెన్ పహాడ్. నవంబర్ 10 (జనం సాక్షి) : న్యాయ సేవలు ప్రజల సాధికారత పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల పార లీగల్ వాలంటర్ వగ్గు సోమన్న అన్నారు శుక్రవారం మండల పరిధిలోని గాజుల మల్కాపురం ,చీదెళ్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గ్రామ ప్రజలకు, ఫోక్సో యాక్ట్ విద్యాహక్కు చట్టం వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ,విద్యార్థులకు యువకులకు, వివిధ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవచ్చని న్యాయ సేవలు చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో వయోవృద్ధుల సంఘం జిల్లా అధ్యక్షులు నారాయణ రామచంద్ర రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ వర కాల అంజయ్య ప్రధానోపాధ్యాయులు ధరావత్ వస్త్రం నాయక్ ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బండారి శేఖర్ ఉపాధ్యాయులు కంచర్ల ప్రభాకర్ ,ఎరగని లింగయ్య , సంధ్యారాణి, రవికుమార్ ,జమాల్ ఉద్దీన్ ,మంజూర్ రవి ,మండల సమైక్య అధ్యక్షురాలు మంజుల, గౌతమి
తదితరులు పాల్గొన్నారు.