న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి  తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సూచనల మేరకు భువనగిరి న్యాయ సేవా సమితి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిపాలన యంత్రాంగం, భువనగిరి ట్రాఫిక్, ఎన్. జి. ఒ సంయుక్త ఆధ్వర్యంలో ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలు, రోడ్డు భద్రతా వాటిపై న్యాయ విజ్ఞాన మరియు చైతన్య సదస్సులను కృషి కళాశాల విద్యార్థులకు, భువనగిరి ఆటో, ఆర్టీసీ బస్సుల, ట్రక్కుల, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లకు కృషి కళాశాలలో మరియు కోర్టు భవనములలో నిర్వచించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు భువనగిరి మండల న్యాయ సేవా సమితి అధ్యక్షులు వి. బాల భాస్కర్ రావు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె. మారుతి దేవి, సీనియర్ సివిల్ జడ్జి దశరామయ్య, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కవిత, యాదాద్రి భువనగిరి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి,
ట్రాఫిక్ ఎ. సి. పి. సైదులు, భువనగిరి మునిసిపాలిటీ కమిషనర్ నాగిరెడ్డి, యాదాద్రి భువనగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్ గౌడ్,
వెహికల్ ఇన్స్పెక్టర్ ఇమ్రాన్, భువనగిరి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి. కేశవరెడ్డిలు ట్రాఫిక్ చట్టాలు, నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించి వాహన చోదకులకు పలు సూచనలు చేసారు. కార్యక్రమములో ట్రాఫిక్ శాఖవారు  ట్రాఫిక్ నిబంధనలపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరించి
తదుపరి విద్యార్థులు, పారా లీగల్ వాలంటీర్లు, ప్యానెల్ న్యాయవాదులతో కృషి కళాశాల నుండి వినాయక చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, ట్రాఫిక్ నియమాల కరపత్రాలు వితరణ చేసారు. కార్యక్రమములో భువనగిరి ట్రాఫిక్ సి. ఐలు. సతీష్, జితేందర్ రెడ్డి, యస్. ఐ. వెంకటేష్ మరియు ట్రాఫిక్ సిబ్బంది, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు.