పంచాయతీరాజ్‌లో బదిలీలు షురూ.
ఖమ్మం జడ్పీ సెంటర్ జనంసాక్షి: పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లాలో 5 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 58 మంది అధికారులు బదిలీ కానున్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలు, నలుగురు సూపరింటెండెంట్‌లు , 11మంది సీనియర్ అస్టిసెంట్లు, 25మంది జూనియర్ అసిస్టెంట్లు ,ఏడుగురు టైపిస్టులు బదిలీ అయ్యే అవకాశం వుంది. ఈ బదిలీలకు సంబంధించి ఈనెల 2వతేది నుంచి 5వ తేది సాయంత్రం 5 గంటలవరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 6వ తేదీన బదిలీలకు సంబంధించి అర్హులైన వారి జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు. బదిలీలకు సంబంధించి ఈనెల 13న జిల్లాపరిషత్ కౌన్సెలింగ్ జరగనున్నట్లు తెలిపారు. ఇదిలా వుండగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుదీర్ఘకాలంగా పాతుకుపోయిన పలువురు అధికారులు తమకు నచ్చిన చోటుకు బదిలీ చేయించుకునేందుకు ఇప్పటినుండే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బదిలీలు కోరుకునే పలువురికి అధికారుల ఆండదండలువుంటే, మరికొందరు రాజకీయ నేతలను నమ్ముకుంటున్నారు. ఇంకొందరు ధన వూపభావంతో తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు మొదలయ్యాయి.