పంచాయితీ ఎన్నికలకు సర్వం సన్నద్దం
వనపర్తి,జూన్6(జనం సాక్షి): త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సజావుగా నిర్వహించ నున్నామన్నారు. కొత్త పంచాయతీరాజ్ చ ట్టం ప్రకారం ఈ పర్యాయం పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం స్థానాలు మహిళలకు కేటాయింపు ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు పోలింగ్‌కు గతంలో మాదిరిగా ఎక్కువ రోజులు గడువు లేకుండా కేవలం 20 రోజలు, ఉపసంహరణలకు పోలింగ్‌కు వారం పది రోజులు మాత్రమే గడువును నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 255 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఉంటాయని, ఇందులో 79 కొత్తవి ఉం డగా, అందులో 33 గిరిజన తండాలున్నాయన్నారు. 2,348 వార్డులను గుర్తించామని, ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూ త్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 4న అన్ని గ్రామపంచాయతీల్లోని పోలింగ్ బూత్‌లను ప్రకటిస్తామని, అభ్యంతరాలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి అయ్యిందని, స్టేజ్ 1 అధికారులు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, గు ర్తుల ఎంపికను చేపడతారని, స్టేజ్ 2 అధికారులు పోలింగ్ నిర్వహించి, ఓట్ల లె క్కింపు, విజేతలను ప్రకటిస్తారని వివరించారు. జిల్లాలో 2,88,400 మంది ఓటర్లున్నట్లు తేలిందని, బీసీ ఓటర్ల జాబితా ను ప్రభుత్వం శుక్రవారం ప్రకటిస్తుందన్నారు. పోలింగ్ నిమిత్తం 1,968 బ్యా లెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 5300 మంది సి బ్బంది అవసరం ఉండగా, ఇప్పటికే 3120 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. వార్డు సభ్యుడి ఎన్నికకు తెలుపు రంగు, సర్పంచు ఎన్నికకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లుంటాయని, ఇప్పటికే గు ర్తుల ఎంపిక కూడా పూర్తయిందని తెలిపారు.