పంజాబ్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ
హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం పంజాబ్‌లోని కన్నా, గోబిందఘర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన దిల్లీ నుంచి రైలులో వస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆయన కలుసుకోనున్నారు. స్వయంగా చూసి పంటనష్టాన్ని తెలుసుకోనున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ధాన్యపు మార్కెట్ యార్డు అయిన కన్నా మార్కెట్ యార్డును సైతం ఆయన సందర్శిస్తారని సమాచారం.