పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం

` అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయకపోవడంపై ఆగ్రహం
` నిప్పులతో చెలగాటమాడొద్దని మండిపాటు
న్యూఢల్లీి(జనంసాక్షి):పంజాబ్‌, తమిళనాడు గవర్నర్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంతో గవర్నర్లు చేస్తున్న జ్యాపంపై మండిపడిరది. ‘విూరు నిప్పుతో చెలగాటమాడుతున్నారు’ అని శుక్రవారం ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పంజాబ్‌, తమిళనాడు గవర్నర్ల తీరును తప్పుపట్టింది. ‘ఎన్నికైన ప్రభుత్వాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను దయచేసి ఆలస్యం చేయవద్దు. ఇది ఆందోళన కలిగించే చాలా తీవ్రమైన విషయం. విూరు నిప్పుతో ఆడుకుంటున్నారు’ అని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ అన్నారు.కాగా, బిల్లుల విషయంలో పంజాబ్‌ గవర్నర్‌ తీరుపట్ల తాము సంతోషంగా లేమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఇష్టానుసారం బిల్లులు క్లియర్‌ చేస్తామని గవర్నర్‌ ఎలా చెబుతారు? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించడంలేదా?’ అని ప్రశ్నించింది. భారతదేశం ఏర్పాటు నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలు, నియమ నిబంధనలను గవర్నర్లు అనుసరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.