పంటను సకాలంలో కొనుగోలు చేయాలి

– మే10న చెక్కుల పంపిణీని పండగులా జరుపుకోవాలి
– మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌ రావు
– సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
మెదక్‌, మే5(జ‌నం సాక్షి ) : అకాల వర్షాలకు తడిసిన పంటలను సకాలంలో కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు సంబంధించి హెలిపాడ్‌, బహిరంగసభ స్థలాలను మంత్రి హరీష్‌ రావు శనివారం  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మెదక్‌ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం శంకుస్థాపనకు వచ్చే సీఎం కేసిర్‌ కు మెదక్‌ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కృతజ్ఞతలు తెలిపాలని కోరారు. ఎన్నో ప్రభుత్వాలు జిల్లా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి మాటమార్చిపోయారు.. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరాగాంధీ కూడా ఇక్కడ జిల్లా కేంద్రము చేస్తామని వారు కూడా మాట తప్పారు. జిల్లా పేరు ఉండి జిల్లా కేంద్రము లేదని సీఎం కేసీఆర్‌ ఉమ్మడి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించి మంచి అభివృద్ధిని అందిస్తున్నారని తెలిపారు. 10 తేదీన రైతులకు చెక్‌ లను అందించే
రైతుబంధు పండగను జరుపుకోబోతున్నాము. ఆకాలవర్షాలు వచ్చినష్టపోయిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. రైతులు మార్కెట్‌ కు తీసుకొచ్చిన పంటను సకాలంలో కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతుబంధు పథకంకు వచ్చే డబ్భును రైతులకే ఇవ్వాలని బ్యాక్‌ అధికారులకు సూచించారు.
————————————-