పంటబీమాతోనే రక్షణ

మెదక్‌,జూలై6(జ‌నం సాక్షి): రైతులు ఖరీఫ్‌లో వేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన పథకంలో భాగంగా బీమా చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. పంటలకు బీమా చేయిస్తే ఏ విధమైన నష్టం వాటిల్లినా పంట నష్టం కింద రు ణాలు అందుతాయని ఆయన అన్నారు. గ్రామంలో రైతులు ఫసల్‌బీమా యోజన పై అవగాహనం పెంచుకోవాలన్నారు. వేసిన పంటలకు మాత్రమే బీమా చేయించాలని సూచించారు. గతంలో రికార్డుల్లో వేరే పంటల పేర్లు నమోదు చేయించి క్షేత్ర స్థాయిలో వేరేపంటలు ఉండడంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులు నిర్బంధ ప్రాతిపదికన బీమా చేస్తాయన్నారు. రుణాలు తీసుకోని రైతులు బీమా ఏజెంట్లకు దరఖాస్తులను అందజేయాలన్నారు.