పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది:
వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు
వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 21
వికారాబాద్ జిల్లా, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” గారు వికారాబాద్ మండలంలోని ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు.
పంట పొలాలను సందర్శించడానికి పానాదుల నుండి కారు వెళ్లలేకపోవడంతో ఎమ్మెల్యే గారు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మోటర్ సైకిళ్ళ పై వెళ్లి… పంట పొలాలను పరిశీలించారు.
అకాలంగా కురిసిన వడగల్ల వానలతో రైతులు చాల నష్టపోయారని, ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అండగా ఉండి ఆదుకుంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.