పంట పొలాలకు సాగునీరు అందించాలి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్
కొల్లాపూర్ పట్టణ పరిధిలోని ఎల్లూరు మార్నింగ్ వాక్ లో భాగంగా రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో దాదాపు 5 కిలోమీటర్లు కాలువ వెంట నడుస్తూ పరిశీలన మాజీ మంత్రి జూపల్లి
అనంతరం రైతులతో కలిసి ఇరిగేషన్ EE. DE లతో సమావేశం తక్షణమే కాలువల్లో జమ్మూతొలగించి కాలువ లైనింగ్ చేయాలని డిమాండ్
కొల్లాపూర్.వరిదేల రామాపురం శివారులోని D1 కాలువ నుండి తాము పండించే పంటలకు సాగునీరు అందడం లేదని పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్న KLI లాంటి ప్రాజెక్టులు ఉన్న తమకు సాగునీరు అందక పంటలు పండించుకోలేకపోతున్నామని గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏటా కాలువల వెంట తిరుగుతూ హరిగోస పడుతున్నామని మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ముందు సంబంధిత రైతులు వారి ఆవేదన వ్యక్తం చేశారు
స్పందించిన జూపల్లి గారు సంబంధిత రైతులతో కలిసి పాదయాత్రగ D1 కాలువ వెంట క్షేత్రస్థాయిలో వారి సమస్యలు తెలుసుకుంటూ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు జూపల్లి గారి ముందు సమస్యలు విన్నవించారు. తాము కాలువ వస్తుందనే నమ్మకంతో మినుములు. బుడ్డలు.మొక్కలు. జొన్నలు వివిధ పంటలు వేసుకున్నామని కానీ నేడు కాల్వపొంటి మొత్తం జమ్ము పేరుకుపోవడంతో ఖాదర్ భాషా దర్గా వరకు మాత్రమే నీరు వచ్చి ఆగిపోతుందని స్థానిక ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
చాలామంది  నీరు రాదనే కారణంతో తమ పంట పొలాలు బీడు పెట్టుకున్నామని రైతులు తలా ఇంత వేసుకొని జెసిబి ఏర్పాటు చేసుకుని జమ్ము తొలగించుకుంటున్నామని కాలువ వెంట సీసీ లేక కింది పొలాలకు జాలువారి పంట పొలాలు పాడవుతున్నాయని తెలిపారు.నీరు రాక పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతుందని తాము పెట్టిన పెట్టుబడి కూడా వెళ్లక అప్పుల పాలు అవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..అనంతరం రైతులను వెంటబెట్టుకుని ఎల్లూరు శివారులో ఉన్న కె.ఎల్.ఐ ఇరిగేషన్ EE.DE లతో సమావేశమై సమస్యను వివరించారు. నియోజకవర్గంలోని అన్ని కాలువలో వెంటనే జమ్మును తొలగించి కాలువ రైతులకు సాగునీరు అందివ్వాలని జూపల్లి గారు డిమాండ్ చేశారు లేనియెడల రైతుల కోసం వారి సమస్య పరిష్కారం కోసం ప్రజస్వామ్య పద్ధతి లో ఆందోళనకు సిద్ధమని జూపల్లి గారు హెచ్చరించారు. వారితోపాటు సంబంధిత రైతులు పట్టణ కౌన్సిలర్ లు ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు జూపల్లి గారి ప్రధాన అనుచరులు కార్యకర్తలు తదితరులు వున్నారు

తాజావార్తలు