పంట సస్యరక్షణ చర్యలకై అవగాహన.

నెరడిగొండసెప్టెంబర్21(జనంసాక్షి):
మండలంలోని బుగ్గారం చిన్న బుగ్గారాం మాట్ లోద్ది గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి బిర్రు భాస్కర్ ప్రత్తి పంటను పరిశీలించారు.బుధవారం రోజున రైతులకు సస్యరక్షణ చర్యలు పై పలు సూచనలు చేయడం జరిగింది. ప్రత్తి పంటలో గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు 6-8 లింగ ఆకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఉదృతి వున్నట్లు అయితే లీ.నీటికి 5మి.లీ వేప నూనె 1500పిపిఎం,క్వినాల్ పాస్ 2మి.లీ లేదా ప్రోఫెన పాస్ 2మి. లీ,తాయోడికర్బ్1.5గ్రా.కలిపి పిచికారి చేయాలని అన్నారు.
రసం పీల్చే పురుగుల నివారణకు ఇమిడా క్లోప్రిడ్ పిచికారి చేయాలన్నారు. మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఏఈఓలకు సంప్రదించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ జైపాల్  రైతులు పాల్గొన్నారు.