పండుగ అర్చనను సన్మానించిన మంత్రి గంగుల
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన నగరానికి చెందిన అర్చన పండుగ ను రాష్ట్ర బి.సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశం జరుపుకుంటున్న అజాదికా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ గీతాన్ని (సంపూర్ణ జనగణమన) ఐదు చరణాలలో సంపూర్ణ గీతాలాపనను 75 సార్లు, సుమారు 7 గంటల పాటు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేయడం అభినందనీయం అన్నారు. మన జాతీయ గీతానికి ఉన్న నిబంధనలకు లోబడి, భారతదేశ జాతీయ గీతం యొక్క విశిష్టతను ప్రపంచం అంతటా తెలిసేలా కృషిచేసిన అర్చన పండుగ కృషి గొప్పదని తెలిపారు. శనివారం పండుగ అర్చన ను మంత్రి కార్యాలయం లో ఘనంగా సన్మానించారు. దేశం కోసం ఇలా ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో ఉండాలని పేర్కొన్నారు. యువతలో దేశం కోసం ఎదైనా సాధించాలనే తాపన ఉండాలని దాని కోసం ప్రతి ఒక్క యవత ముందుకు రావాలని అన్నారు.