పందిరి సాగు విస్తరణకు రుణాలు
మెదక్,మే21(జనం సాక్షి): ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్న నూతన సాగువిధానాన్ని దశల వారీగా మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు విస్తరిస్తారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద మల్కాపూర్‌ను ఎంపికచేసి ప్రయోగాత్మకంగా తీగజాతి పందిరి సాగుకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణసాయం చేస్తున్నారు. గ్రామానికి చెందిన 35మంది మహిళా రైతులకు రూ.35లక్షల రుణసాయాన్ని బ్యాంకు నుంచి మంజూరు చేయించారు. బీర, కాకర, బెండ, సోరకాయ తదితర కూరగాయల పంటలను తమ బ్యాంకు ప్రోత్సహిస్తుందన్నారు.
తీగజాతి పందిరి ద్వారా అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వీలుంటుందన్నారు. మల్కాపూర్‌లో ఈ సాగు విధానం విజయవంతమైతే ఇతర గ్రామాల్లోనూ తీగజాతి పందిరి సాగుకు ప్రాధాన్యతను ఇస్తామన్నారు.తీగజాతి పందిరి సాగుపై స్వయం సహాయక సంఘాల మహిళలు దృష్టిని సారించాలని స్త్రీనిధి బ్యాంకు రీజినల్ మేనేజర్ అనంతకిషోర్ సూచించారు. స్త్రీనిధి బ్యాంకు ద్వారా అందజేసిన రుణ సాయంతో తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో సాగు చేసిన వివిధ రకాలైన తీగజాతి పందిరిసాగును ఇటీవల పరిశీలించారు.
——-