పంపిణీకి మార్గదర్శకాలు జారీ

నేటి నుంచి 17వ తేదీ వరకు పంపిణీ 
మెదక్‌,మే9(జ‌నం సాక్షి):  మెదక్‌ జిల్లాలో నేటి నుంచి 17వ తేదీ వరకు రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ కేంద్రాల వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. డిప్యూటి సి/-పీకర్‌ పద్మాదేవేదంర్‌ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి తదితరలుఉ చెక్కల పంపిణీలో పాల్గొంటారు. పంపిణీ కేంద్రాల్లో ఉండే బృందాలకు బాధ్యతలను అధికారులు అప్పగించారు. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చెక్కులు, పాసుపుస్తకాల పంపిణీకి వేదికలుగా ఎంపిక చేశారు. ఎండలు మండుతున్న దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. జిల్లాలోని 20 మండలాల పరిధిలోని 391 రెవెన్యూ గ్రామాల్లో 2.14 లక్షల మంది రైతులకు రూ.153 కోట్ల విలువ చేసే 2.17 లక్షల చెక్కులను పంపిణీ చేసేందుకు 803 ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో టీం సభ్యులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు.
రైతులకు ముందుగానే పాసుపుస్తకాలు, చెక్కులకు సంబంధించిన స్లిప్పులు పంపిణీ చేపట్టారు.
ఒకవేల స్లిప్పులు అందించలేకపోతే అలాంటి రైతుల జాబితా తయారు చేసి అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామంలో పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ చేసే స్థలంలో 300 మంది కంటే ఎక్కువ వస్తే అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. కౌంటర్‌ వివరాలు కేటాయించిన గదిపై అతికించి వారికి తెలియ చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా షామియానాలు, కుర్చీలు వేయించాలి. పంపిణీ కేంద్రంలో ఒక మైక్‌, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తహసీల్దార్‌, మండల వ్యవసాయ అధికారి ఉదయం 6 గంటలకు మండల కేంద్రం నుంచి బయలుదేరి 6:30 వరకు గ్రామాలకు చేరుకుని పాసుపుస్తకాలు, చెక్కులను టీంలకు అందించాలని కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు.
——