పకడ్భందీగా ప్రాథమిక విద్యాబోధన చేయాలి
జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు
మెదక్, జనవరి 30 (): మెదక్ ఆంధ్రప్రదేశ్ మిని గురుకుల పాఠశాలను కలెక్టర్ ఎ.దినకర్‌బాబు, సబ్‌కలెక్టర్ భారతి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి విద్యార్థినిలతో మాట్లాడారు. హాస్టల్‌లో ఉపాధ్యాయులు పిల్లలకు తల్లి, తండ్రిగా భావించాలన్నారు. ప్రాథమిక విద్య విద్యార్థులకు పునాది వంటిదన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు విద్యాబోధన సరిగా ఏసి వారిని తీర్చి దిద్దాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు కొత్త మెను ప్రకారం పౌష్టికాహారం ఇవ్వాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ కార్యక్రమంలో మెదక్ సబ్‌కలెక్టర్ భారతి, తహశీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.