పక్కాగా ఎన్నికల లెక్కలు అప్పగించాలి

మెదక్‌,జనవరి19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని జిల్లా అధికారులు అన్నారు.ప్రతి సర్పంచ్‌ అభ్యర్థి రూ.లక్షన్నరలోపు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. సర్పంచ్‌ అభ్యర్థులు, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియామవళిని తప్పకుండా పాటించి ఎన్నికల సిబ్బందికి సహకరించాలని కోరారు. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు రోజువారి ఖర్చులను రిటర్నింగ్‌ అధికారికి అప్పగించాలని జిల్లా కోఆపరేట్‌ అధికారి వెంకట్‌ పేర్కొన్నారు.పంచాయతీ ఎన్నికలో బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేసినప్పటినుంచి ఎన్నికలు జరిగేంత వరకు రోజువారి లెక్కలను అప్పగించాలన్నారు. బరిలో నిలిచిన సర్పంచ్‌ అభ్యుర్థులు రూ.1.50వేలు,వార్డు సభ్యులు రూ.30వేలు రూపాయల లోపే ఖర్చు చేయాలన్నారు. ఎన్నికలో అభ్యుర్థులు గెలిచినా, ఓడినా లెక్కలను రోజువారీగా తప్పకుండా రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలన్నారు.