పక్కాగా కోడ్ అమలు
హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి):
వరంగల్ ఉపఎన్నికల సందర్భంగా కోడ్‌ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 14,75,311 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 2015 జనవరి 17 తర్వాతే ఇక్కడ 33,222 మంది కొత్తగా చేరారన్నారు. ఇక్కడ ఉప ఎన్నిక సందర్భంగా 1751 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. ఎక్కడైనా కోడ్‌ను ఉల్లంఘిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ మేరకు అధికారులకు పక్కాగా ఆదేవాలు ఇచ్చామన్నారు.